29, డిసెంబర్ 2010, బుధవారం

ఏ చేద్దాం?

"ఏం కొనేటట్టు  లేదు ఏం తినేటట్టు లేదు  అన్నాడు పాతికేళ్ళ కిందట  పి ఎల్ నారాయణ
ఎన్నాళ్లకైనా ఏం మారలా  పార్టీల పేర్లు తప్ప ,
ఏది కొందామన్నా వందకి ఒక కిలో  చూసి ఆనందించడమే చలో చలో
ఉల్లి తరుగుతుంటే వచ్చేవి ఉత్తుత్తి నీళ్ళు
రేటు వింటేనే వస్తున్నై  భారీగా కన్నీళ్లు
చూసామా  విన్నామా ఇంటికొచ్చామా
అంతే, రుచి చూసామా  తిన్నామా  అదంతా పగటి కల !....
బొమ్మల్లో చూద్దాములే కూరగాయల పేర్లు
గిన్నెల్లో మాత్రం  ఉత్తుత్తి చారులు
నూనెలు మబ్బుల్లోకి......  పప్పులు చుక్కల్లోకి....
  కోట శ్రీనివాస రావు కోడికూర  తిన్నట్టు(అహనా పెళ్ళంట లో )
 తోటకూర కొనటానికి   పూటకూలి చాలట్లా
 ఏం చేద్దాం సోదరా? ఇంట్లోనే  దీక్ష  అదే నిరాహార దీక్ష !.........