చుక్కలు కానే కావవి కంది పెసరపప్పులు
చక్కగ చూస్తూ గడిపెయ్ కొనాలంటే తిప్పలు
పేదవాడు వెతకాలిక ఎంగిలాకు కుప్పలు
సామాన్యుడి బతుకంతా పప్పులకై అప్పులు
తారలు కోసుకురమ్మని కోరదులె ప్రేయసి
కూరలు పప్పులు కూడా కొనలేవని తెలిసి
ఆకాశం అందుతున్న సరుకుల ధరలను చూసి
చందమామను కూడా చూడలేము దడిసి
పప్పన్నం లేకుండా చెయ్యి పెళ్లి తంతులు
బియ్యం గింజలు బదులుగా "ప్లాస్టిక్ అక్షింతలు"
శనివారం 8 ఆగస్టు 2009
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి (Atom)


:) nice
ప్రత్యుత్తరంతొలగించు