8, మార్చి 2009, ఆదివారం

మహిళా దీనోత్సవం

నరకాసురవధ సత్యభామవిజయం మహిళా దినోత్సవం.
ద్రౌపది శపథం నెరవేర్చుకున్నదిఆత్మగౌరవ దినోత్సవం.
రుద్రమదేవి మహాదేవరాజుతో కనకాభిషేకం చేయించుకున్నరోజు మహిళా విజయోత్సవం.
సగం ముఖం తెగిపడినావీర విహారం చేసింది ఝాన్సీరాణి నారీ ధైర్యోత్సవం.
అంతరిక్షానికి అలవోకగా వెళ్లారు కల్పనా సునీతలు- సబలాదినోత్సవం.
కానీ ----అత్యాచారాల వార్తలులేకుండా ఒక్కరోజు గడిచినా అది నిజంగా "మహిళా దినోత్సవం"
"మానవతా దినోత్సవం"
లేదంటే........
కాదా అది మహిళా దీనోత్సవం!!

7, మార్చి 2009, శనివారం

ఇలా ఉందాం.

ఎప్పుడు చూసినా ఉరుకుల పరుగుల జీవనయానం
కల్సి ఒకేచోట కని తిని విని అని ఎన్నినాల్లయింది ?మనం
ఉన్నది నలుగురమే కాని కల్సుకోనీయని కాలాన్ని ఏమనిఅందాం
ఒక్కసారైనా రోజులో ఒకచోట కూర్చుని మాట్లాడుకుందాం !
రుచులు ఆస్వాదిస్తూ అమ్మకి, అభిరుచులు చర్చిస్తూ నాన్నకీ
దగ్గరగా గడుపుదాం
దినమంతా కలిగిన భావాల్ని అనుభవాల్నీ పంచుకుందాం
టి వి చూడని సమయం ఎంతబాగుందో అనుకుందాం!
ప్రతిరోజూ కొత్తగా మొదలెడదాం .
ఏమంటారు? ఇలాఉందాం!